News

పెంచి పోషించడం పాకిస్తాన్‌ పాలసీ


కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఉగ్రవాదులను పెంచి పోషించడం పాకిస్తాన్‌ పాలసీగా మారిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్వెట్టాలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నామన్నారు. అలాగే పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు సహకరిస్తోందని, భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చివరికి దానికే బాధితులు కావాలని, దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్తాన్ అబద్ధం చెబుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత్‌ ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.